Posts

Showing posts from 2020

Maguva O Maguva - Vakeel Saab(2020)

Image
Maguva O Maguva - Vakeel Saab(2020) Lyrics : Ramajogayya Sastry Singer : Sid Sriram Music : S S Thaman మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వేలే జగమంతా పరుగులు తీస్తావు ఇంటా బయటా అలుపని రవ్వంత అననే అనవంటా వెలుగులు పూస్తావు వెళ్లే దారంతా నీ కాటుక కనులు విప్పారాకపోతే ఈ భూమికి తెలవారదుగా నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా ప్రతి వరుసలోనూ ప్రేమగా అల్లుకున్న బంధమా అంతులేని నీ శ్రమ అంచనాలకందుమా ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవులేని జగతిలో దీపమే వెలుగునా నీదగు లాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక మొగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునువ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా

Ideraa Sneham - 30 Rojullo Preminchatam Ela

Image
Ideraa Sneham - 30 Rojullo Preminchatam Ela(2020) Lyrics : Chandrabose Singer : Armaan Malik Music : Anup Rubens ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం కనివిని ఎరగని స్నేహం ఇది కాలం చూడని స్నేహం దేహం అడగని స్నేహం ఇది హృదయం అడిగే స్నేహం నింగిని నేలని వానచినుకై కలిపెను స్నేహం తూర్పుకి పడమరకి కాంతితోరణమయ్యింది స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం కనివిని ఎరగని స్నేహం ఇది కాలం చూడని స్నేహం దేహం అడగని స్నేహం ఇది హృదయం అడిగే స్నేహం మీ మధ్యన ఉంటానంటూ బతిమాలింది చిరుగాలి మీ పాదం తాకాలంటూ అలలయ్యింది ఆ కడలి తన మచ్చను మీ స్వచ్చతతో కడగాలంది జాబిల్లి మీ భారం మోసేటందుకె  పుట్టానంది ఈ పుడమి ఆశలు ఆకర్షణలు లేనిదే మీ ఆడ మగ స్నేహం నీతోనే ఇంకో నువ్వే చేసే స్నేహమే మీ ఇద్దరి స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం తన చూపులు నువ్వు చూస్తుంటే నీ కలలను తను కంటోంది తన మాటలు నువ్వంటుంటే నీ నవ్వులు తను నవ్వింది తను అడుగులు వేస్తూ ఉంటే గమ్యం నువ్వే చేరేవు నీలో నువ్వు చెయ్యని పనులే నీల

Sara Sari - Bheeshma(2020)

Image
Sara Sari - Bheeshma(2020) Singer : Anurag Kulkarni Lyrics : Shree Mani Music : Mahathi Swara Sagar నా కలలే నీ రూపంలో ఎదురయ్యే నిజమా మాయ ఏవేవో ఊహలు నాలో మొదలయ్యే నా మనసే నింగిని దాటి ఎగిరెనులే నిజమా మాయ ఈ క్షణమే అద్బుతమేదో జరిగెనులే ఏదో ఏదో చెప్పాలనిపిస్తోందే నువ్వే నువ్వే కావాలనిపిస్తోందే ఇంకా ఏదో అడగాలనిపిస్తోందే నీతో రోజూ ఉండాలనిపిస్తోందే ఓ నాలోనే నవ్వుకుంటున్నా నాతోనే ఉండనంటున్నా నాకేనే కొత్తగా ఉన్నా నీవల్లే నీవల్లే ఓ నీవెంటే నీడనౌతానే నువ్వుండే  జాడనౌతానే నువ్వుంటే చాలనిపించే మాయేదో చల్లావే సరా సరి గుండెల్లో దించావే మరీ మరీ మైకంలో ముంచావే ఓ అయినా సరే ఈ బాధ బాగుందే అనుకోనిదే మనిరువురి పరిచయం ఓహో జతపడమని మనకిలా రాసుందే మతిచెడి ఇలా నీ వెనకే తిరగడం అలవాటుగా నాకెలా మారిందే ఆగలేని తొందరేదో నన్ను తోసే నీవైపిలా ఆపలేని వేగమేదో నాలోపలా ఇంతకాలం నాకు నాతో ఇంతగొడవే రాలేదిలా నిన్ను కలిసే రోజు వరకు ఏరోజిలా లేనే ఇలా సరా సరి గుండెల్లో దించావే మరీ మరీ మైకంలో ముంచావే ఓ అయినా సరే ఈ బాధ బాగుందే

Peniviti - Aravinda Sametha(2018)

Image
Peniviti - Aravinda Sametha(2018) Singer : Kaala Bhairava Lyrics : Ramajogayya Sastry Music : Thaman S S నిద్దరిని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను ఒంటెద్దు బండెక్కి రారా సగిలేటి డొంకల్లో పదిలంగా రారా నలిగేటి  నా మనసు గురుతొచ్చి రారా గలబోటి కూరొండి పిలిసీనా రారా పెనిమీటి ఎన్నినాళ్ళయినాదో నిను చూసి కళ్లారా ఎన్నెన్ని నాళ్లయినాదో నిను చూసి కళ్లారా చిమ్మటి చీకటి కమ్మటి సంగటి ఎర్రగా కుంపటి ఎచ్చగా దుప్పటి కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి గుండెనే గొంతుసేసి పాడతాంది రారా పెనిమిటి గుండెనే గొంతుసేసి పాడతాంది రారా పెనిమిటి చిమ్మటి చీకటి కమ్మటి సంగటి ఎర్రగా కుంపటి ఎచ్చగా దుప్పటి కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి గుండెనే గొంతుసేసి పాడతాంది రారా పెనిమిటి పొలిమేర దాటి పోయావని పొలమారిపోయే నీ దానిని కొడవలి లాంటి నిన్ను సంటివాడని కొంగున దాసుకునే ఆలి మనసుని సూసి సూడక సులకన చేయకు నా తలరాతలో కలతలు రాయకు తాళిబొట్టు తలసుకొని తరలి తరలి రారా పెనిమిటి నరగోస తాకే కామందువే నరగోస తాక

Ideraa Bharatadesam - Hotel Mumbai

Image
Ideraa Bharatadesam - Hotel Mumbai Singer : Vivek Hariharan Lyrics : Chandrabose Music : Sunny Inder ప్రతి మనిషిలో చూస్తాం దైవత్వం పరహితము క్షేమం మా తత్త్వం రక్షించేటందుకే మా రక్తం ప్రాణాలిచ్చేందుకు పడి చస్తాం మా సుఖ సౌఖ్యం వదులుకుంటాం ఇతరులకోసం కదులుతుంటాం సాయమే ఒక గేయమై ధ్వనించిన దేశం ఇదేరా భారతదేశం ... ఇదేరా భారతదేశం ఇదేరా భారతదేశం ... ఇదేరా భారతదేశం మీ కష్టాన్ని తుడిచే కన్నీళ్లలా చిందిస్తాం మేమే కన్నీళ్లు మీ కష్టాన్ని తుడిచే కల్లాపిలా  చిందిస్తాం మేమే  కన్నీళ్లు మీ భయాన్ని తుంచే ఆయుధంలా అందిస్తాం మేమే మునివేళ్ళు కరుణేగా ఇక్కడి వర్షం మానవతేగా ఈ ఋతుపవనం ప్రతి మట్టికణమొక క్షేత్రంగా వెలసిన దేశం ఇదేరా భారతదేశం ... ఇదేరా భారతదేశం ఇదేరా భారతదేశం ... ఇదేరా భారతదేశం సూర్యుడి ఎరుపుని చంద్రుడి తెలుపుని పంటలో పచ్చెను తీద్దాం గుండెల నిండుగ జెండా ఎగరగా త్యాగానికి సంసిద్ధం ఇదేరా భారతదేశం ... ఇదేరా భారతదేశం ఇదేరా భారతదేశం ... ఇదేరా భారతదేశం