Posts

Showing posts from August, 2017

చునుకులా రాలి

చినుకులా రాలి... నదులుగా సాగి....  వరదలైపోయి... కడలిగాపొంగు...  నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ  నదివి నీవు కడలి నేను మరిచిపోబోకుమా హా మమత నీవేసుమా  చినుకులా రాలి... నదులుగా సాగి....  వరదలైపోయి... కడలిగాపొంగు...  నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ  ఆకులురాలె వేసవిగాలి నా ప్రేమ నిట్టూర్పులే... కుంకుమపూసె వేకువ నీవై తేవాలి ఓదార్పులే  ప్రేమలుకోరె జన్మలలోని నేవేచి వుంటనులే ... జన్మలుదాటె ప్రేమను నేనై నేవెల్లువౌతానులే .. ఆ చల్లని చాలులే  హిమములా రాలి .. సుమములై పూసి.. రుతువులై నవ్వి.. మధువులై పొంగి  నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ  శిశిరమైన సిధిలమైన... విడిచిపోబోకుమా.. విరహమై పోకుమా తొలకరికోసం తొడిమనునేనై.. అల్లడుతున్నానులే .. పులకరమూదె పువ్వులకోసం వేసారుతున్నానులే  నింగికినేలా అంటిసలాడె .. ఆ పొద్దురావాలిలే .. నిన్నలు నీడై.. రేపటి నేడై నాముద్దు తీరాలిలే...  తీరాలు చేరాలిలే  మౌనమై మెరిసి... గానమై పిలిచి...  కలలతో అలిసి...  గగనమై ఎగసి .. నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ  భువనమైనా గగనమైనా ప్రేమమయమే సుమ.. హా..ప్రేమ మనమే సుమ ... చినుకులా రాలి... నదులుగా సాగి....  వరద

సింగారాల పైరుల్లోన

సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి(2) ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట (సింగారాల) వద్దంటానే పాతదనాన్ని ముద్దంటానే కొత్తదనాన్ని కొత్తగ ఇపుడే పుట్టావని అనుకోమంట బతుకే దారి పోతే ఏంటి బాటేదైనా నీకది ఏంటి నారుని వేసే ఆ పైవాడే నీరే పోస్తాడే మూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి బోగి మంటలలోన నీవే వెయ్యరా తెల్ల వారగానే సంకురాత్రి కాదా పొంగే పాలు అందరి పలు హాయిగా నేల తల్లి పంచేనంట పైడి పంట నీకు నాకు అంతకంటే సందడేది లేదే (సింగారాల) బంధాలేంటి , బంధువులేంటి పోతే ఏంటి, వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడని జన్మే నాదిరా మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు వెలిసే ఆతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట హృదయం మాత్రం నాదే ఊపిరి కాదా తనదే నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే నా మిత్రుడు పెట్టే తిండి నీ తింటున్నానీవేళ తన మాటే నాకు వేదం అంట ఏ వేళ శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తలం వేసే పాటలు పాడే పువ్వుల జంట మేమే (సింగారాల)