Manchu Kondallona Chandrama - Tajmahal(1995)

Manchu Kondallona Chandrama - Tajmahal(1995)




Manchu kondallona chandramaa chandanalu challipo
mecchi melukunna bandhamaa andamanta alluko
mogga praayamlo siggu teeramlo madhurame sangamam
kotta daahamlo vinta mohamlo manadile sambaram
pallavinchutunna pranayamaa malli malli vacchipo
vinnavinchukunna paruvamaa vennamuddalicchipo
konte raagamlo janta gaanamlo valapuke vandanam

Oopiralle vacchi usulenno techi
aadi padi peda gunde tatti tatti tatti tatti
ningi raliponi nela tuliponi
veediponi prema gudu katti katti katti katti
todai nuvvunte needai nenunta
lokam nuvvanta yekam kammanta
valachi maru janmalo gelichi ninu cheranaa
yugamu kshanamai sadaa jagamu maripinchanaa
veyyellu vardhillu taragani cheragani taragani premalalo

pallavinchutunna pranayamaa malli malli vacchipo
Manchu kondallona chandramaa chandanalu challipo

Vennelamma monna kunalamma ninna
kannevannelanni chuse guchi guchi guchi guchi
gunnamavi komma sannajaji remma
muchatade ninnu nannu mechi mechi mechi mechi
chinde singaram sigge sindhuram
ponde vaibhogam nade ee bhagyam
kalayikala kavyamai kalalu chigurinchenaa
shruti layala sutaramai priyuni jata koranaa
yededu lokala yellalu datina allari premalalo

Manchu kondallona chandramaa chandanalu challipo
pallavinchutunna pranayamaa malli malli vacchipo
mogga praayamlo siggu teeramlo madhurame sangamam
konte raagamlo janta gaanamlo valapuke vandanam


మంచు కొండలలోన చంద్రమా చందనాలు చల్లిపో 
మెచ్చి మేలుకున్న బంధమా అందమంత అల్లుకో 
మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో మధురమే సంగమం
కొత్త దాహంలో వింత మోహంలో మనదిలే సంబరం
పల్లవించుతున్న ప్రణయమా మళ్ళి మళ్ళి వచ్చిపో 
విన్నవించుకున్న పరువమా వెన్నముద్దలిచ్చిపో 
కొంటె రాగంలో జంట గానంలో వలపుకే వందనం 

ఊపిరల్లె వచ్చి ఊసులెన్నో తెచ్చి 
ఆడి పాడి పేద గుండె తట్టి తట్టి తట్టి తట్టి 
నింగి రాలిపోని నెల తూలిపోని
వీడిపోని ప్రేమ గుడు కట్టి కట్టి కట్టి కట్టి 
తోడై నువ్వుంటే నీడై నేనుంట 
లోకం నువ్వంట ఏకం కమ్మంట 
వలచి మరు జన్మలో గెలిచి నిను చేరనా 
యుగము క్షణమై సదా జగము మరిపించనా 
వెయ్యేళ్ళు వర్ధిల్లు తరగని చెరగని తరగని ప్రేమలో 

పల్లవించుతున్న ప్రణయమా మళ్ళి మళ్ళి వచ్చిపో
మంచు కొండలలోన చంద్రమా చందనాలు చల్లిపో 

వెన్నెలమ్మ మొన్న కూనలమ్మ నిన్న 
కన్నెవన్నెలన్ని చూసి గుచ్చి గుచ్చి గుచ్చి గుచ్చి 
గున్నమావి కొమ్మ సన్నజాజి రెమ్మ 
ముచ్చటాడే నిన్ను నన్ని మెచ్చి మెచ్చి మెచ్చి మెచ్చి 
చిందే సింగారం సిగ్గే సింధూరం
పొందే వైభోగం నాదే ఈ భాగ్యం 
కలయికల కావ్యమై కళలు చిగురించెనా 
శ్రుతి లయల సూత్రమై ప్రియుని జత కోరనా 
ఏడేడు లోకాల ఎల్లలు దాటిన అల్లరి ప్రేమలలో 

మంచు కొండలలోన చంద్రమా చందనాలు చల్లిపో 
పల్లవించుతున్న ప్రణయమా మళ్ళి మళ్ళి వచ్చిపో 
మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో మధురమే సంగమం
కొంటె రాగంలో జంట గానంలో వలపుకే వందనం 


Comments

Popular posts from this blog

Mallepuvva - Ravoyi Chandamama(1999)

Talukumannadi Kulukula tara - Tapassu(1995)