Urumulu Nee Muvvalai - Chandralekha(1998)

Urumulu Nee Muvvalai - Chandralekha(1998)






ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘానివై రా అలివేణి
 పరుగులు నీ గానమై తరగలు నీ తాళమై చిలిపిగ చిందాడవే కిన్నెరసాని 
కాలానికే కాలాడక ఆగాలి నువ్వు ఆడే వేళ 
అది చూడగా మనసాగకా ఆడాలి నీతో నింగినేల
తకథిమి తాళాలపై తళుకుల తరంగమై చిలిపిగ చిందాడవే కిన్నెరసాని
 మెలికల మందాకిని కులుకుల బృందావని కనులకు విందీయవే ఆ అందాన్ని


చంద్రుళ్లో కుందేలే మా ఇంట ఉందంటూ మురిసింది ఈ ముంగిలి
చిందాడే కిరణంలా మా ముందు నువ్వుంటే ప్రతిపూటా దీపావళి 
మా కళ్లల్లో వెలిగించవే సిరివెన్నెలా... 
మా ఆశలే నీ అందెలై ఈ మంచు మౌనం మోగే వేళ
 ఆ సందడే ఆనందమై ప్రేమించు ప్రాణం పాడే వేళా 
ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘానివై రా కళ్యాణి
 తకథిమి తాళాలపై తళుకుల తరంగమై చిలిపిగ చిందాడవే కిన్నెరసానీ


 నడియాడే నీ పాదం నటవేదమేనంటూ ఈ పుడమే పులకించగా 
నీ పెదవి తనకోసం అనువైన కొలువంటూ సంగీతం నినుచేరగా 
మా గుండెనే శ్రుతి చేయవా నీ వీణలా 
ఈ గాలిలో నీ కేళితో రాగాలు ఎన్నో రేగే వేళ 
నీ మేనిలో హరివిల్లులే వర్ణాలవాగై సాగే వేళ 
ఉరుములు నీ మువ్వలై మెరుపులు 
నీ నవ్వులై తొలకరి మేఘానివై రా అలివేణి 
తకథిమి తాళాలపై తళుకుల తరంగమై చిలిపిగ చిందాడవే మ్మ్ మ్మ్...

Comments

Popular posts from this blog

Mallepuvva - Ravoyi Chandamama(1999)

Okkasari Okkasari - ManchuKurise Velalo