Kadalalle veche kanule - Dear Comrade(2019)

Kadalalle Veche Kanule - Dear Comrade(2019)




Director : Bharat Kamma
Lyrics    : Rehaman
Music Director : Justin Prabhakaran
Singer(S) : Sid Sriram , Aishwarya Ravichandran


కడలల్లె వేచె కనులే ..
కదిలేను నదిలా కలలే ...
కడలల్లె వేచె కనులే ..
కదిలేను నదిలా కలలే ...
ఒడిచేరి ఒకటై పోయే
ఒడిచేరి ఒకటై పోయే
తీరం కోరే ప్రాయం

విరహం పొంగెలే ...
హృదయం ఊగెలే ...
అధరం అంచులే ...
మధురం కోరెలే ...

అంతేలేని ఏదో తాపం ఏమిటిలా
నువ్వేలేక వేధిస్తుందే వేసవిలా
చెంతచేరి సేదతీరా ప్రాయమిలా
చెయ్యి చాచి కోరుతోంది సాయమిలా
కాలాలు మారినా...
నీ ధ్యాస మారునా ..
అడిగింది మొహమే ...
నీ తోడు ఇలా ఇలా ...

విరహం పొంగెలే ...
హృదయం ఊగెలే ...
అధరం అంచులే ...
మధురం కోరెలే ...

కడలల్లె వేచె కనులే ..
కదిలేను నదిలా కలలే ...
కడలల్లె వేచె కనులే ..
కదిలేను నదిలా కలలే ..

నిన్నే నిన్నే కన్నునలో
దాచానులే లోకముగా
నన్నే నన్నే మలిచానే
నీవుగా ...
బుగ్గమీద ముద్దెపెట్టే చిలిపితనం
ఉన్నట్టుండి  నన్నే చుట్టే పడుచుగుణం
పంచుకున్న చిన్ని చిన్ని సంతోషాలెన్నో
నిండిపోయే ఉండిపోయే గుండెలోతుల్లో
నీలోనే చేరగా ...
నా నుంచి వేరుగా ...
కదిలింది ప్రాణమే ...
నీ వైపు ఇలా ఇలా ...

Comments

Popular posts from this blog

Mallepuvva - Ravoyi Chandamama(1999)

Okkasari Okkasari - ManchuKurise Velalo