Posts

Showing posts from July, 2019

Undipo - Ismart Shankar(2019)

Image
Undipo - Ismart Shankar(2019) ఉండిపో ఉండిపో చేతిలో గీతలా ఎప్పుడూ ఉండిపో నుదుటిపై రాతలా ఉండిపో ఉండిపో కళ్లలో కాంతిలా ఎప్పుడూ ఉండిపో పెదవిపై నవ్వులా నీతోనే నిండిపోయే నా జీవితం వదిలేసి వెళ్లనంది ఏ జ్ఞాపకం... మనసే మొయ్యలేనంతలా పట్టి కొలవలేనంతలా విప్పి చెప్పలేనంతలా హాయే కమ్ముకుంటోందిగా ఏంటో చంటిపిల్లాడిలా నేనే తప్పిపోయానుగా నన్నే వెతుకుతూ ఉండగా నీలో దొరుకుతున్నానుగా ఉండిపో ఉండిపో చేతిలో గీతలా ఎప్పుడూ ఉండిపో నుదుటిపై రాతలా సరికొత్త తడబాటే మారింది అలవాటులాగా ఇది చెడ్డ అలవాటే వదిలేసి ఒక మాటు రావా మెడ వంపు తాకుతుంటే మునివేళ్లతో బిడియాలు పారిపోవా ఎటువైపుకో ఆహా' సన్నగా సన్నగా సన్న జాజిలా నవ్వగా ప్రాణం లేచి వచ్చిందిగా మళ్ళీ పుట్టినట్టుందిగా ఓహో' మెల్లగా మెల్లగా కాటుక్కళ్ళనే తిప్పగా నేనో రంగులరాట్నామై చుట్టూ తిరుగుతున్నానుగా తల నిమిరే చనువౌతా నువు గాని పొలమారుతుంటే ఆ మాటే నిజమైతే ప్రతిసారి పొలమారిపోతా అడగాలిగాని నువ్వు అలవోకగా నా ప్రాణమైన ఇస్తా అడగచ్చుగా ప్రాణం నీదని నాదని రెండు వేరుగా లేవుగా ఎపుడో కలుపుకున్నాం కదా విడిగా ఉండలేనంతగా ఉందాం అడుగులో అడుగులా విందాం...

Urumulu Nee Muvvalai - Chandralekha(1998)

Image
Urumulu Nee Muvvalai - Chandralekha(1998) ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘానివై రా అలివేణి  పరుగులు నీ గానమై తరగలు నీ తాళమై చిలిపిగ చిందాడవే కిన్నెరసాని  కాలానికే కాలాడక ఆగాలి నువ్వు ఆడే వేళ  అది చూడగా మనసాగకా ఆడాలి నీతో నింగినేల తకథిమి తాళాలపై తళుకుల తరంగమై చిలిపిగ చిందాడవే కిన్నెరసాని  మెలికల మందాకిని కులుకుల బృందావని కనులకు విందీయవే ఆ అందాన్ని చంద్రుళ్లో కుందేలే మా ఇంట ఉందంటూ మురిసింది ఈ ముంగిలి చిందాడే కిరణంలా మా ముందు నువ్వుంటే ప్రతిపూటా దీపావళి  మా కళ్లల్లో వెలిగించవే సిరివెన్నెలా...  మా ఆశలే నీ అందెలై ఈ మంచు మౌనం మోగే వేళ  ఆ సందడే ఆనందమై ప్రేమించు ప్రాణం పాడే వేళా  ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘానివై రా కళ్యాణి  తకథిమి తాళాలపై తళుకుల తరంగమై చిలిపిగ చిందాడవే కిన్నెరసానీ  నడియాడే నీ పాదం నటవేదమేనంటూ ఈ పుడమే పులకించగా  నీ పెదవి తనకోసం అనువైన కొలువంటూ సంగీతం నినుచేరగా  మా గుండెనే శ్రుతి చేయవా నీ వీణలా  ఈ గాలిలో నీ కేళితో రాగాలు ఎన్నో రేగే వేళ...